సామెత Chapter 14 TELIRV Bible Verse Images

సామెత 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.

సామెత 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.

సామెత 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.

సామెత 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.

సామెత 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

సామెత 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

సామెత 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

సామెత 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

సామెత 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.

సామెత 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.

సామెత 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.

సామెత 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

సామెత 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.

సామెత 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.

సామెత 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.

సామెత 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.

సామెత 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.

సామెత 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.

సామెత 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.

సామెత 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.

సామెత 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

సామెత 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.

సామెత 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

సామెత 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

సామెత 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

సామెత 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.

సామెత 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

సామెత 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.

సామెత 14:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.

సామెత 14:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.

సామెత 14:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.

సామెత 14:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

సామెత 14:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

సామెత 14:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

సామెత 14:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 14 (ASV) »
King James Version (KJV)
Proverbs 14 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 14 (GW) »
Berean Bible (BSB)
Proverbs 14 (BSB) »
World English Bible (WEB)
Proverbs 14 (WEB) »
French Bible (LSG)
Proverbes 14 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 14 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 14 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 14 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 14 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 14 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 14 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 14 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 14 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 14 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 14 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 14 (BULG) »
Japanese Bible (JPN)
箴言 14 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 14 (NORSK) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List