సంఖ్యాకాండం Chapter 27 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.

సంఖ్యాకాండం 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకుల ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి “మా తండ్రి ఎడారిలో చనిపోయాడు.

సంఖ్యాకాండం 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు కోరహు గుంపులో, అంటే యెహోవాకు విరోధంగా కూడినవారి గుంపులో లేడు. తన పాపాన్నిబట్టి, తన సొంత పాపాన్నిబట్టి చనిపోయాడు.

సంఖ్యాకాండం 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలోనుంచి తీసెయ్యాలా? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి” అన్నారు.

సంఖ్యాకాండం 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,

సంఖ్యాకాండం 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో “సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే.

సంఖ్యాకాండం 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి, వారి తండ్రి స్వాస్థ్యం వాళ్లకు వచ్చేలా చూడు.

సంఖ్యాకాండం 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.

సంఖ్యాకాండం 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి కూతుళ్ళు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి.

సంఖ్యాకాండం 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.

సంఖ్యాకాండం 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం” అన్నాడు.

సంఖ్యాకాండం 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా యెహోవా మోషేతో “నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.

సంఖ్యాకాండం 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు దాన్ని చూసిన తరువాత, నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంతవారితో చేరిపోతావు.

సంఖ్యాకాండం 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను ఘనపరచకుండా, నా మీద మీరు తిరగబడ్డారు” అన్నాడు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేషులో ఉన్న మెరీబా నీళ్ళు.

సంఖ్యాకాండం 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే యెహోవాతో “యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండాా ఈ సమాజం మీద యెహోవా ఒకణ్ణి నియమించు గాక.

సంఖ్యాకాండం 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వారి ముందు వస్తూ, పోతూ,

సంఖ్యాకాండం 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్లకు నాయకుడుగా ఉండడానికి సమర్థుడుగా ఉండాలి” అన్నాడు.

సంఖ్యాకాండం 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యెహోవా మోషేతో “నూను కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి పెట్టి

సంఖ్యాకాండం 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట, అతని నిలబెట్టి, వారి కళ్ళ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు.

సంఖ్యాకాండం 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు.

సంఖ్యాకాండం 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి” అన్నాడు.

సంఖ్యాకాండం 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,

సంఖ్యాకాండం 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని మీద తన చేతులు పెట్టి, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 27 (ASV) »
King James Version (KJV)
Numbers 27 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 27 (GW) »
Berean Bible (BSB)
Numbers 27 (BSB) »
World English Bible (WEB)
Numbers 27 (WEB) »
French Bible (LSG)
Nombres 27 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 27 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 27 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 27 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 27 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 27 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 27 (HEB) »
Portuguese Bible (BSL)
Números 27 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 27 (VIE) »
Spanish Bible (RVA)
Números 27 (RVA) »
Italian Bible (RIV)
Numeri 27 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 27 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 27 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 27 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 27 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 27 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 27 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 27 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 27 (BULG) »
Japanese Bible (JPN)
民数記 27 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 27 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List